వ్యవసాయ,వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సు ల్లో ప్రవేశాలు

- ఈ నెల 19వ తేదీ నుంచి 23 వ తేదీ వరకూ వ్యవసాయ,వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సు ల్లో ప్రవేశాల కోసం తొలి సంయుక్త కౌన్సిలింగ్
- మొదటి సారి గా బీ ఎస్సీ (అగ్రికల్చర్),బీ టెక్(ఫుడ్ టెక్నాలజీ) కోర్సులలో రైతు కూలీల పిల్లలకి ప్రత్యేక కోటా
జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, ఆగస్ట్ 18 :
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం మరియు శ్రీ పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయా ల పరిధిలోని వివిధ వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు మొదటి దశ సంయుక్త కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ G.E. C H విద్యాసాగర్ తెలియజేశారు. ఈ కౌన్సిలింగ్ ను రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో19 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకూ ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ తెలి పారు.రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి అనుగుణంగా వ్యవసాయ కూలీల పిల్లలకి తొలిసారి గా బీ ఎస్సీ (అగ్రికల్చర్),బీ టెక్(ఫుడ్ టెక్నాలజీ) సీట్ల లో ప్రత్యేక కోటా అమలు చేయనున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. బీ ఎస్సీ(అగ్రికల్చర్ )లో 15 శాతం సీట్లు, బీ ఎస్సీ(ఫుడ్ టెక్నాలజీ)కోర్సు లో 15 శాతం సీట్లని వ్యవసాయ కూలీల పిల్లలకి కేటాయించినట్లు వివరించారు.విద్యార్థులు తమ 4 వ తరగతి నుంచి 12 వ తరగతుల విద్యాభ్యాసం లో కనీసం నాలుగేళ్లు ప్రభుత్వపాఠశాలలు,కళాశాలలు,గురుకులాలు,ప్రభుత్వ సంస్థల్లో చదివిన విద్యార్థులు ఈ ప్రత్యేక కోటా కి అర్హులని తెలిపారు.అదేవిధంగా విద్యార్థి పేరు పైన కానీ, తమ తల్లితండ్రుల పేరు పైన కానీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గ్రామీణ ఉపాధి హమీ పథకం కార్డు కలిగి ఉన్న వారే ఈ కోటా కి అర్హులు అని, విద్యార్థులకి కానీ లేదా అతని తల్లితండ్రులు, తాత ఎటువంటి వ్యవసాయ భూమి కలిగి ఉండరాదనీ స్పష్టం చేశారు.లేదంటే విద్యార్థుల పేరు పైన గానీ,వారి తల్లి తండ్రుల పేరు పైన కానీ ఎకరం లోపు భూమి కలిగి,విద్యార్థులు తమ 4 వ తరగతి నుంచి 12 వ తరగతుల విద్యాభ్యాసం లో కనీసం నాలుగేళ్ళు ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలలు,గురుకులాలు,ప్రభుత్వ సంస్థలలో చదివిన వారు కూడా ఈ సీట్ల కి అర్హులని తెలిపారు. పై అర్హతలకి సంబందించిన అన్ని దృవపత్రాలు తో కౌన్సిలింగ్ కి హాజరు కావాలని రిజిస్ట్రార్ సూచించారు. బీ ఎస్సీ (అగ్రికల్చర్),బీ టెక్(ఫుడ్ టెక్నాలజీ) కోర్సులకి మొదటి సెమిస్టరు కి 49,560 రూపాయల ఫీజు ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలు విశ్వ విద్యాలయం వెబ్ సైట్ www.pjtau.edu.in లో చూడవచ్చని రిజిస్ట్రార్ G.E. CH విద్యా సాగర్ పేర్కొన్నారు.