రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11,12 వ తేదీ ల లో ఖమ్మం లో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర ద్వితీయ విద్యా వైజ్ఞానిక మహా సభల పోస్టర్ ను కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ స్టేషన్ హై స్కూల్ లో ఆవిష్కరించడం జరిగింది.

అనంతరం మండల శాఖ అధ్యక్షులు శ్రీ సి హెచ్ వెంకట్రామనర్సయ్య గారు మాట్లాడుతూ “అంతరాలు లేని విద్య , ప్రజల హక్కు – ప్రజల బాధ్యత అజెండా తో జరిగే ఈ మహాసభలకు గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని, రెండు రోజులు వివిధ విద్యా సదస్సులు జరుగుతున్నందున ఉపాద్యాయులు ఎక్కువ సంఖ్యలో హాజరై మహాసభల ను విజయవంతం చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ తండా సదానందం గారు, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు బి.రాజు గారు మండల భాద్యులు ఎన్. నర్సింహారాజు ,ఎమ్. సదయ్య, ఏ. సురేష్ ,వి.నర్సయ్య ,జి. మోహన కృష్ణ, నర్సింహ రెడ్డి ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

You may also like...

Translate »