Delhi: కవిత కేసులో నేడు కీలకం..
Delhi: కవిత కేసులో నేడు కీలకం.. కోర్టుకు హాజరుపరుచనున్న ఈడీ..

ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు కీలకం కానుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ.. నేటితో ముగియనుంది.
దీంతో కవితను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో నేడు ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు.
అలాగే కవిత వేసిన బెయిల్ పిటిషన్ కూడా నేడు విచారణకు రానుంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే ఈడీని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు.