భారత్‌లో కరోనా: 3,420 యాక్టివ్‌ కేసులు, మరణాలు ఎన్నంటే..

భారత్‌లో కరోనా: 3,420 యాక్టివ్‌ కేసులు, మరణాలు ఎన్నంటే..?

ఢిల్లీ: కరోనా వైరస్‌ కొత్త వేరియెంట్‌ జేఎన్‌.1 వ్యాప్తిపై ఆందోళన నెలకొన్న వేళ.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మూడు వేలు దాటేసింది. తాజాగా..శనివారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం 423 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,420కి చేరింది.అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్‌లో 12 మంది కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగు చూశాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటక..రాజస్థాన్‌లో ఒకరి చొప్పున వైరస్‌ బారినపడి మరణించారు.

You may also like...

Translate »