ప్రకృతి సత్యాలు

నేలతల్లి చెప్పింది!నిరాశ్రయులకు ఆశ్రయంకల్పించాలని. మండుచున్న సూర్య గోళం చెప్పింది!మంచి జరిగినప్పుడువేడిమినైనా భరించాలని ఒక ఆకు రాలుతూ చెప్పింది!ఈ జీవితం శాశ్వతం కాదని.ఎప్పుడో ఒకప్పుడు రాలిపోవలసిందే నని. చీమల బారు చెబుతోందిక్రమశిక్షణతో మెలగాలని ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది!జీవించేది ఒక్క రోజైనా పరిమళాలువెదజల్లుతూ గౌరవంగా జీవించమని. ఒక మేఘం...