కల్లుబట్టి వద్ద యువకుడిపై కత్తితో దాడి.

కల్లుబట్టి వద్ద యువకుడిపై కత్తితో దాడి.
జ్ఞాన తెలంగాణ – బోధన్
బోధన్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల కల్లుబట్టి వద్ద గంగాధర్(38) అనే వ్యక్తిపై జీవన్ సింగ్ అనే వృద్దుడు ఘర్షణపడి క్షణికావేశంలో కత్తితో దాడి చేసినట్లు బోధన్ పట్టణ సీఐ వీరయ్య తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం పాండుతర్ప కాలనీకి చెందిన గంగాధర్ బోధన్ పాతబస్టాండ్ వద్దగల కల్లుబట్టిలో నుంచి బయటకు వచ్చే క్రమంలో జీవన్ సింగ్ అనే వృద్దుడిని ఎదురుపడి తగలడంతో జీవన్ సింగ్ అనే వృద్దుడు కిందపడ్డాడని తెలిపారు.ఈ క్రమంలో ఒకరికొకరికి మాట మాట పెరిగ ఘర్షణీ జరగడంతో జీవన్ సింగ్ తన వద్ద ఉన్న కత్తితో క్షణికావేశంలో గంగాధర్ మెడపై దాడి చేశాడని తెలిపారు. దాంతో అతనికి తీవ్ర రక్తస్రావం కావడంతో సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.జీవన్ సింగ్ జీవనోపాధి కోసం కత్తులు తయారుచేసి విక్రయిస్తుంటాడని సీఐ తెలిపారు. బాధితుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరయ్య తెలిపారు.