కన్నుల పండుగగా ధ్వజారోహణం

జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ: 08-06-2024. ఈరోజు కొడకండ్ల మండలంఎడునూతుల గ్రామంలో
ఇల్లందు వాస్తవ్యులు ఆరూట్ల శశాంక చార్యులు గారు, పురోహితులు వెంకన్న,వంశీ,రాజేష్ స్వామి ,దేవాలయ పూజారి తోమాల శ్రీ నివాస్ స్వామి ఆద్వర్యంలో


ఏడునూతుల లొని శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవాలయం లొ బ్రహ్మోత్సవాలలో నేటి ఉదయం :- యాగశాలాపువేశం, ద్వారతోరణపూజ, మూర్తికుంభారాధన, అగ్ని ప్రతిష్ఠ, మూలమంత్ర హవనం, గరుడ హవనం, ధ్వజారోహణం (గరుడ ముద్ద ఎగురవేయుట) తీర్థప్రసాద వితరణ,అలాగే సాయంత్రం :- చతుస్థాసార్చన, నిత్యహోమం, బలిహరణం, భేరీపూజ, దేవతాహ్వానము, తీర్థప్రసాద వితరణం జరిగాయి,ధ్వజారోహణం లొ గరుడ ప్రసాదం ను కళ్యాణం కాని వారికి,సంతానం లేని వారికి ,గ్రహ దోష సమస్యలు ఉన్నవారకి,సర్ప దోష సమస్యలు ఉన్న భక్తులకు గరుడ ప్రసాదం పంపిని చేసారు,ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగు బ్రహ్మోత్సవాలలో గరుడ ప్రసాదం తీసుకున్న వారికి సంతానం లేని వారకి సంతానం కలుగుతుందని, పెళ్లి కాని వారకి పెళ్లి జరుగుతున్నాయని భక్తుల ప్రగాడ నమ్మకం ఉండటం తొ చుటుప్రక్కల గ్రామల భక్తులు కూడా వచ్చి గరుడ ప్రసాదం తీసుకొవడం జరిగింది ,
అలాగే రేపు ఉదయం :- నవకలస్థాపన , రామేశ్వరం లోని 25 బావుల జలం 108 కలశాలతో మూలవిరాట్ లకు అభిషేకం నిత్యహోమం, బలిహరణం, స్వామి వారి నూతన వస్త్రాలంకరణం, అలాగే సాయంత్రం :- మూర్తికుంభారాధన, నిత్యహోమం, బలిహరణం, ఎదురుకోళ్ళు

:- *7:30 ని||లకు శ్రీవారి కళ్యాణోత్సవం, కళ్యాణ అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగుతుంది .కావున భక్తాగ్రేసరులెల్లరు అత్యధిక సంఖ్యలో పాల్గోని శ్రీవారి సేవలను తిలకించి తీర్థప్రసాదములను
స్వీకరించి, శ్రీవారి కృపను పొందగలరని దేవాలయ కమిటీ తెపినారు.

You may also like...

Translate »