నా గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు: కడియం కావ్య

నా గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు: కడియం కావ్య
జ్ఞాన తెలంగాణ హనుమకొండ
నా గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు అని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.శుక్రవారం నాడు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ… వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, నా గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు,నాపై నమ్మకంతో నాకు ఓటు వేసి భారీ మెజార్టీతో ఇచ్చిన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు అని వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం భాగంగా ఇచ్చిన హామీల అన్నిటిని నెరవేర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.ముఖ్యంగా వరంగల్ మాస్టర్ ప్లాన్ అమలు,ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం,అండర్ డ్రైనేజీ నిర్మాణం,రైల్వే జంక్షన్ డివిజన్ గా ఏర్పాటు,రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హైదరాబాద్ భూపాలపల్లి నేషనల్ హైవే ఇండస్ట్రియల్ కారిడార్ చేయడం కోసం కృషి చేస్తామన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి పార్లమెంటు స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిపించిన వరంగల్ ప్రజల లౌకికవాదానికి కట్టుబడి ఉన్నామన్నారు. వరంగల్ జిల్లా ప్రజలు ఎల్లప్పుడు అన్ని మతాలకు మద్దతునిస్తూ సమాన ప్రాధాన్యత కల్పించడం గొప్ప విషయం అన్నారు.బొగ్గు గనులు, సారవంతమైన నేలలు,అడవి సంపద,గోదావరి నది వంటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి పాటుపడతామన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం,ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ముందుంటుందని,జిల్లా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే,బిజెపి పార్టీ గాని, మోడీ ప్రభుత్వం గానీ, రాజ్యాంగం జోలికి వస్తే ఊరుకునేది లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పరకాల ఎమ్మెల్యే ఎవరు ప్రకాష్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే శ్రీహరి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్,నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.