బడి బాట కార్యక్రమంను మొక్కుబడిగా కాకుండా పకడ్బందీగా నిర్వహించాలి

బడి బాట కార్యక్రమంను మొక్కుబడిగా కాకుండా పకడ్బందీగా నిర్వహించాలి
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పేంచాలి
డిబిఎఫ్ రాష్ట్ర ఉపాద్యాక్షులు చుంచు రాజేందర్.
వరంగల్ జ్ఞాన తెలంగాణ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్య శాఖ నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంను మొక్కుబడిగా కాకుండా పకడ్బందిగా నిర్వహించాలని బడిఈడు పిల్లలను బడిలో చేర్పించేందుకు విద్యాశాఖ కృషి చేయాలని
రాష్ట్ర ప్రభుత్వాన్ని,
ఉమ్మడి వరంగల్
జిల్లా విద్యాశాఖ అధికారులను డిబిఎఫ్ రాష్ట్ర ఉపాద్యాక్షులు చుంచు రాజేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు హన్మకొండలో డిబిఎఫ్ నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో చుంచు రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి మండలం లో ఇంటర్నేషనల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని అన్నారు. దళితులకు పేదలకు నాణ్యమైన ఉన్నత విద్యావకాశాలను పెంపొందించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో
నర్సరీ ని ప్రారంభించాలని
ఉపాధ్యాయ ఖాళీలలను భర్తి చేయాలన్నారు.
విద్యకు రాష్ట్ర బడ్జెట్ లో 20 శాతం నిధులను కేటాయించి తెలంగాణ సమాజాన్ని విద్య , వైజ్ఞానిక రంగాల్లో అగ్రగామిగా నిలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలోని విద్యాలయాలలో మౌళిక వసతులను కల్పించాలి.
విద్యార్థులలో సైంటిఫిక్ టెంపర్ ను పెంపొందించే శాస్త్రీయ దృక్పథం కలిగిన విద్యా విధానాలను అమలు చేయాలన్నారు
గురుకులాలు,సంక్షేమ హస్టళ్ళలో కనీస వసతులను పెంపొందించాలని.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాస్మొటిక్,మెస్ చార్జీలను పెంచాలన్నారు.
ప్రతి మండలం లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాలయాలను ప్రవేశపెట్టాలని
అంబేద్కర్ విద్యానిధి,బెస్ట్ అవలెబుల్ పధకాలకు నిధులు పెంచాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదాసి సురేష్, జిల్లా కార్యదర్శి చుంచు నరేష్ తదితరులు పాల్గొన్నారు.