ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందిఅమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ(AAPC)చైర్మన్ హసీనా

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుంది
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ(AAPC)చైర్మన్ హసీనా
జ్ఞాన తెలంగాణ కేసముద్రం రూరల్,జూన్ 6.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని కేసముద్రం మండలంలోని అర్పణపల్లి ప్రాథమికోన్నత పాఠశాల లో ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యక్షత న ఏ.ఏ.పి.సి చైర్మన్ మరియు గ్రామైక్య సంఘాల వి.ఓ.లు మరియ అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు మరియు ఉపాధ్యాయులు కలిసి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఏ.ఏ.పి.సి.చైర్మన్ మొహమ్మద్ హసీనా మాట్లాడుతూ ప్రభుత్వ పాటశాల లొనే నాణ్యమైన విద్య అందుతుందని, గ్రామంలో ని తల్లిదండ్రులు అందరూ ప్రభుత్వ పాఠశాల లో నే విద్యార్థులు చేర్పించాలని అన్నారు. స్వయం సహాయక గ్రూప్ ల సభ్యులు అందరూ విద్యార్థులను చేర్పించుటకు కృషి చేయాలని అన్నారు.అనంతరం మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ తీయడం జరిగింది.
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎన్. నర్సింహారాజు, పంచాయతీ సెక్రెటరీ ప్రవీణ్ , వి.ఓ.లు లావణ్య, హరిణి మరియు రాజమణి అంగన్వాడీ టీచర్లు రేణుక మరియు ఆశా కార్యకర్తలు ,టీచర్లు వినోద్, నరసింహ.స్వామి, శ్రీను ,కరుణ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.