లక్ష్యం కోసం ఏర్పాటు చేస్తే…. నిర్లక్ష్యంగా మారాయి

లక్ష్యం కోసం ఏర్పాటు చేస్తే…. నిర్లక్ష్యంగా మారాయి
సేంద్రియ ఎరువుల ద్వారా అధిక దిగుబడి కోసం షే డ్లు
రాష్ట్రంలో కంపోస్ట్ షెడ్ల నిర్మాణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) రాష్ట్రంలో రైతులకు క్రిమిసంహారక మందుల బదులు సేంద్రియ ఎరువుల ద్వారా పంటల మీద ప్రయోగించి అధిక దిగుబడి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఇంట్లో వాడుకునే వివిధ రకాలైన పదార్థాలతోటి సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవడం కోసం కోట్ల నిధులు వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కంపోస్ట్ సెడ్ల నీర్మాణం చేపట్టారు. తెలంగాణ లో ఇలాంటి కార్యక్రమం ఒక బృహత్తరంగా నడిచింది ప్రతి గ్రామంలో కంపోస్ట్ల షేడ్ల నిర్మాణం చేపట్టారు. అయితే ఈ షెడ్లలో మనం వండుకునే ఆహార పదార్థాలు కూరగాయలు పండ్లు మిగిలిపోయినటువంటి వ్యర్ధాలు పడేయకుండా కొన్ని రకాలైన కూరగాయ ముక్కలు ఆకుకూరలు చెట్ల ఆకులు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సామాన్లు ఏవైతే మనం ఇంటిలో నుంచి పారవేస్తామో వీటన్నిటిని వేరుగా చేసి కంపోస్ట్ షెడ్ లో మనం భద్రపరిచి వాటి ద్వారా ఎరువులను తయారు చేయడం ఈ కంపోస్ట్ షెడ్ల ప్రధాన ఉద్దేశం కానీ పలు గ్రామాల్లో కంపోస్ షేర్లు నిర్మాణం చేపట్టారు కానీ అక్కడ ఎలాంటి ఎరువులకు సంబంధించిన ఆనవాళ్లు లేవు.
దీనికి కారణం అక్కడ గ్రామపంచాయతీకి కానీ ఇతరులకు గాని కంపోస్ట్ షెడ్ల నిర్మాణంలో అవగాహన లేకపోవడం వ్యర్ధపదార్థాలను కూడా పరిశుద్ధ కార్మికులు తీసివేసి పక్కన పడేయడం లేదంటే కాల్చి వేయడం ఇప్పటికే జరుగుతుంది కొంత వ్యర్ధాలను తరలించినప్పటికీ మిగిలిన రోజువారి మిగిలిపోయిన వ్యర్ధాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కంపోస్ట్ షెడ్లకు తరలించక నిర్లక్ష్యంగా బయటపడబోయడం జరుగుతూ ఉంటుంది.
దీనివల్ల ఊరికి దూరంగా ఈ షెడ్ల నిర్మాణం జరగడం వల్ల దూర భారం వల్ల వ్యర్ధాలను తరలించడం కష్టంగా మారింది దీనివల్ల అనుకున్న లక్ష్యం కాస్త నీరుగారి పోయింది. ఈ ఎరువుల తయారీపై వ్యవసాయ శాఖ అధికారులతో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎరువుల తయారీ విధానం గురించి గ్రామ సర్పంచులకు లేదా అక్కడి కార్మికులకు అవగాహన కల్పిస్తే ఎంతో ప్రయోజనం ఉండేది కానీ అవగాహన లేక ఆ వ్యర్ధాలను కంపోస్టు షెడ్యూల్ తరలించక ఆ లక్ష్యం కాస్త నీరుగారిపోయింది. ఫలితంగా పలు గ్రామాల్లో లక్షలాది నిధులతో వెచ్చించిన కంపోస్ట్ శెడ్ల వల్ల ప్రయోజనం లేకుండా పోయింది.
మండల పరిధిలోని పలు గ్రామాల్లో కంపోస్ట్ షెడ్లు ఉపయోగించకపోవడంతో ఖాళీగా పడి ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో కొన్ని ఎరువులకు సంబంధించిన వ్యర్ధాలు తరలించినప్పటికీ వాటిలో ఎరువుల తయారీకి సంబంధించిన పనులు ఏం జరగకపోవడం ఫలితంగా షెడ్ల నిర్మాణం నిర్లక్ష్యానికి గురి అయింది.
రాష్ట్రంలో రైతులు అధిక పంటల దిగుబడి కోసం విపరీతంగా ఎరువులు వాడడం వల్ల మానవుల ఆరోగ్యానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మన ఇంట్లో మిగిలిన వ్యర్ధాలతో కూరగాయలు ఆకులు, పండ్లు తినేసిన వ్యర్ధాలతో కంపోస్టుల తయారీ కోసం ఏర్పాటు చేసినటువంటి షెడ్లు అవి కాస్త ఉపయోగం లేకుండా పోయాయి.
ఈ కంపోస్ట్ సెల్లులో తయారయ్యే ఎరువుల ద్వారా అధిక దిగుబడితో పాటు పందిన పంటపై ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఆరోగ్యకరమైన కూరగాయలు ఇతర పంటలు పండించుకోవడానికి ఈ కంపోస్టుల నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం అప్పట్లో ఆలోచించి తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయకుండా నిర్మాణాలు చేపట్టింది. ఇప్పటికైనా అధికారులు లక్ష్యం కోసం ఏర్పాటుచేసిన కంపోస్ట్ చెర్లపై అధికారులు దృష్టి సారించి ఎరువుల తయారీకి ఉపయోగపడే విధంగా ఒక కార్యాచరణ దిశగా వాటిని కొనసాగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.