ప్రభుత్వ నియమాలను పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వ నియమాలను పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి
TSSO రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్*
జ్ఞాన తెలంగాణ
శంషాబాద్
కార్పొరేట్ మరియు ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు ప్రభుత్వ నియమాలను పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా D.E.O సుసింద్రరావు కు వినతి పత్రం అందజేసిన
TSSO రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్ ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ
కార్పొరేట్ మరియు ప్రైవేట్ పాఠశాలల యజమానులు ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా అనగా అధిక ఫీజులు వసూలు చేయుట.
ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫార్మ్స్ బూట్లు, అమ్ముట.
సరైన కట్టడాలు లేకుండా ఇనుప షెడ్లల్లో పాఠశాలను నడుపుట.
B. Ed క్వాలిఫైడ్ టీచర్స్ తో కాకుండా ఇంటర్ టెన్త్ పాసైన ఉపాధ్యాయులతో బోధన.
ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
శంషాబాద్ మండలంలో పాఠశాలల పర్యవేక్షణలో భాగంగా జూకల్ లో D.E.O M.E.O రాంరెడ్డికి
వినతి అందజేశారు .
ఈ కార్యక్రమంలో TSSO రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్, .రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీసాల వంశీ, దర్శన్, వెంకట్, TSSO కమిటీ సభ్యులు వంశీ, సచిన్, భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.