సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మాత బండ్ల గణేష్

సీఎం రేవంత్ రెడ్డికీ సారీ చెప్పిన కాశీనాథ్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ షాద్ నగర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయనతోపాటు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తాండ్ర కాశీనాథ్ రెడ్డి ఉన్నారు.
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిన్న ఫలితాలు వచ్చిన అనంతరం బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని నిర్మాత బండ్ల గణేష్ తో పాటు కాశీనాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అదేవిధంగా అంతకుముందు ఆయా పార్లమెంటు నియోజకవర్గం ఎంపీలు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశం జరిపిన నేపథ్యంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రస్తావన జరిగింది. ఈ సందర్భంగా కాశీనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సారీ చెప్పారు. అతి స్వల్ప మెజార్టీతో పార్లమెంటు స్థానం చేజారడం బాధగా ఉందని చెప్పడంతో సీఎం రేవంత్ రెడ్డి ఓదార్చారు. అదేవిధంగా ఇటీవలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బండ్ల గణేష్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకుని విష్ చేశారు. ఈ సందర్భంగా కాశీనాథ్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రోజే ముఖ్యమంత్రిని కలవడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఎలాంటి విషయాలు లేవని సాధారణంగానే కలవడం జరిగిందని చెప్పారు.

You may also like...

Translate »