ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం.


ఫోటో. పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేస్తున్న ఐ సి డి ఎస్ ఉద్యోగులు.
జ్ఞాన తెలంగాణ – బోధన్
బోధన్ పట్టణంలోని పదో వార్డులో బుధవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సిడిపిఓ జానకి అన్నారు .అలాగే పర్యావరణ రహితంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వస్తువులను నిషేధించి పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. ప్లాస్టిక్ కంటే సహజమైన పర్యావరణకు అనుకూలంగా ఉత్పత్తులను ఉపయోగించడం మంచిదని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను సగానికి పైన తగ్గించడం రానున్న కాలానికి అనుకూలంగా విత్తనాలు నాటించడంపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్ రాధిక, అంగన్వాడీ టీచర్స్ అర్చనా, సరోజ , చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.

You may also like...

Translate »