సాయిఆదర్శ మహిళ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

సాయిఆదర్శ మహిళ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం.
జ్ఞాన తెలంగాణ – బోధన్
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని బుధవారం బోధన్ పట్టణంలోని సాయి ఆదర్శ యువతీ మహిళ మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్బంగ స్వచ్ఛభారత్ కార్యక్రమం ,ఇంటింటికి నిమ్మ, జామ ,మామిడి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళా మండలి అధ్యక్షురాలు పద్మశ్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ని నిషేధించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో కమల ,అక్షయ్, ఖాజాబీ, రణవీర్ ,అనీఫా ,గీత, సైదవ, బాలమణి ,ఎస్తేరి పాల్గొన్నారు.
