గుట్టుచప్పుడు కాకుండా అక్రమ నిర్మాణాలు

గుట్టుచప్పుడు కాకుండా అక్రమ నిర్మాణాలు
జ్ఞాన తెలంగాణ
శంషాబాద్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ గ్రామ పరిధిలో అక్రమ నిర్మాణాలు భారీ షెడ్లు గుట్టు చప్పుడు కాకుండా నిర్మిస్తున్నారు.తమ పని తాము చేస్కుంటూ పోతున్నారు.
వార్తాపత్రికలలో వార్త ప్రచురితమైన అధికారులు వచ్చి కూల్చివేసినా తిరిగి నిర్మాణాలు చేపడుతూనే ఉన్నారు.
111జి ఓ పరిధిలో భారీ నిర్మాణాలకు అనుమతి లేదు అటువంటిది భారీ నుండి అతి భారీ షెడ్లను నిర్మిస్తున్నారు.
దీనికి కారణం అధికారుల నిర్లక్షమా ప్రజల వెనక బాటు తనమో గాని అక్రమ నిర్మాణాలను మాత్రం ఆపే నాధుడే లేకుండా అయి పోయింది.
111 జిఓ ను లెక్కచేయకుండా ఇటువంటి నిర్మాణాలు చేపడుతూపోతే జంట జలాషయాలు కలుషితం అయిపోయి త్రాగు నిరుకు కష్టతరం అవుతుందని పర్యావరణ వేత్తలు చెపుతున్న అధికారులు మాత్రం పట్టించుకోక పోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.
