కె.వి.ఆర్ గెలుపు చేవెళ్ల అభివృద్ధికి మలుపు

బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ ప్రేమ్ రాజ్

జ్ఞాన తెలంగాణ
శంషాబాద్

చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలలో కొండా విశ్వేశ్వర్ రెడ్డివిజయం సాధించడంతో రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని శంషాబాద్ పట్టణంలో సంబరాలు జరుపుకున్నారు.టపాసులు పేల్చి స్వీట్లు పంచుకొన్నారు.
మరో సారి మోడీ ప్రధానమంత్రి కావడం దేశానికి ఎంతో అవసరం అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సీట్లు పెరగడం పట్ల బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ నరేద్రమోడీ మన దేశానికి ప్రధాన మంత్రిగా ఉండడం ప్రతి భరతీయుడు ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు.దేశానికి మోడీ అవసరం చాలా ఉందని అన్నారు మోడీ యుగ పురుషుడని అలాంటి నాయకులు మన భారత దేశంలో పుట్టడం మన అదృష్టమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నందకిశోర్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...

Translate »