రాజకీయాలలో గెలుపు, ఓటములు సహజం

జ్ఞాన తెలంగాణ కేసముద్రం, జూన్ 4.

రాజకీయంలో గెలుపు ఓటములు సహజమని రైతు సంఘం నాయకుడు సంకేపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు పత్రిక ప్రకటన విడుదల చేసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని గత రెండు పర్యాయాలు రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగించిందని, కానీ నేడు ప్రజలు మార్పును కోరుకున్నారని వారి ప్రజా తీర్పును గౌరవిస్తామన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యల పట్ల పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరు బాధపడొద్దని ఆధైర్యపడవద్దన్నారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని గుర్తు చేశారు. పది సంవత్సరాలు ప్రజలు బిఆర్ఎస్ పాలనను చూశారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. గెలిచిన ఎంపీ లు దేశ అభివృద్ధికి పాటు పడాలని కోరారు. ఎన్నికలు ఐపోయాయి కాబట్టి అందరూ కలిసి మెలిసి వుండాలని కోరారు.

You may also like...

Translate »