రాష్ట్ర అవతరణదశాబ్ది వేడుకలకు

రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు
సర్వం సిద్ధం:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
రాష్ట్ర అవతరణ వేడుకలకు ముస్తాబైన ఐడిఓసి కార్యాలయం.
అతిథుల కొరకు షామియానాలు, కుర్చీలు ఏర్పాటు.
జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి:
పది వసంతాల తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ వేడుకలకు జిల్లా కార్యాలయాలు ముస్తాబయ్యాయని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అవతరణ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించి ఆదివారం (జూన్ 2) ఉదయం జాతీయ జెండాలను ఆవిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన క్రతువులో అసువులు బాసిన అమరవీరులకు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఆదివారం ఉదయం తొలుత నివవాళులు అర్పిస్తారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొనాలని ఆయన సూచించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించి ప్రసంగించనున్నారని తెలిపారు.
జిల్లా లోని గ్రామపంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన సాగుతున్న నేపథ్యంలో అన్ని గ్రామాల్లో వారే జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు,ఒక్కో ప్రత్యేకాధికారికి రెండు లేదా మూడు పంచాయతీలు ఉంటే వారి స్థానంలో పంచాయతీ కార్యదర్శి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని ఐడిఓసి కార్యాలయం త్రివర్ణ శోభితంగా కాంతులీనుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ భవనాలకు విద్యుద్దీప కాంతులతో అమర్చారు. జూన్ 2 వరకు ఈ వెలుగులు కొనసాగనున్నాయి.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు-2024 సందర్భంగా జరుగనున్న మినిట్ టు మినిట్ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రకటించారు
ఉదయం 8.40 గంటలకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్దకు ఎస్పి వస్తారు.
8.42 గంటలకు
భూపాలపల్లిలోని అమరవీరుల స్థూపం వద్దకు కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ భవేశ్ మిశ్రా చేరుకుంటారు.
08.45 గంటలకు
తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం వద్ద పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులు అర్పించి, అమరవీరుల స్థూపం నుంచి బయలుదేరుతారు.
08.47 గంటలకు
ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.
8.52 గంటలకు
ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం నుండి ఐడిఓసి కార్యాలయానికి బయలుదేరుతారు.
8.55 గంటలకు ఐడిఓసి కార్యాలయానికి ఎస్పి చేరుకుంటారు.
8.57 గంటలకు ఐడిఓసి కార్యాలయానికి కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ భవేశ్ మిశ్రా చేరుకుంటారు.
8.58 గంటలకు
జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ భవేశ్ మిశ్రా పోలీసులచే గౌరవ వందనం స్వీకరిస్తారు.
09.00 గంటలకు
జిల్లా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి
జాతీయ గీతాలాపన చేస్తారు.
ఉదయం 9.05 నుండి 9.15 వరకు జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ భవేశ్ మిశ్రా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
9.20 గంటలకు
కార్యక్రమం ముగుస్తుంది
ఇట్టి వేడుకల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొనాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ఎలాంటి మినహాయింపు లేదని ఈ విశిష్టమైనటువంటి వేడుకల్లో ప్రతి ఒక్కరు బాధ్యతగా పాల్గొనాలని కలెక్టర్ ఆదేశించారు.