ఫర్టిలైజర్ సీడ్స్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన

ఫర్టిలైజర్ సీడ్స్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన
వ్యవసాయం,పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీకాంత్ రెడ్డి
జ్ఞాన తెలంగాణ, (కందుకూరు)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలోని ఫర్టిలైజర్, సీడ్స్ దుకాణాల్లో వ్యవసాయం, పోలీసు రెవెన్యూ అధికారులు
తనిఖీలు నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు ఉన్న ఆదికృత విత్తనాల, ఎరువుల, పురుగుమందుల దుకాణాలను శనివారం వ్యవసాయం,పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల విక్రయాన్ని అరికట్టేందుకు వ్యవసాయ రెవెన్యూ పోలీసు శాఖల అధికారులు తమ సిబ్బందితో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి శనివారం కందుకూరు మండల కేంద్రం లోని కల్పన ఫర్టిలైజర్స్, శ్రీనివాస ఫర్టిలైజర్స్, అంజనీ సీడ్స్, వినాయక ఫర్టిలైజర్స్, శ్రీరామ సీడ్స్, ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్,షాపులను తనిఖీ చేసి దుకాణంలో ఉన్న ఎరువులు విత్తన నిలువలపై పై ఆరా తీశారు.రికార్డ్స్ ను, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మహేశ్వరం మండల అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీకాంత్ రెడ్డి నాణ్యమైన విత్తనాలు రైతులకు విక్రయించాలని సూచించారు.నకిలీ విత్తనాలు విక్రయిస్తే దుకాణదారులపై కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ, అగ్రికల్చర్,పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.