రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి
జ్ఞాన తెలంగాణా న్యూస్//
వికారాబాద్ జిల్లా//
నవాబుపెట్ మండల//
వికారాబాద్
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘ టన వికారాబాద్-సదాశివ పేట రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య శనివారం ఉదయం చోటుచేసుకుంది.
రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం వికారాబాద్ జిల్లా నవాబుపెట్ మండలం మమ్మదనపల్లి గ్రామ సమీపంలో గల రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని మృతదేహం గ్రామస్తులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు..
శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి (30) రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మరణించినట్టు స్థానికులు భావిస్తున్నారు. మృతదేహం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి మార్చురిలో భద్రపరిచారు.
వికారాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు….
