డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చుంచు రాజేందర్ ఎన్నిక


వరంగల్ జ్ఞాన తెలంగాణ
మే 30 వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన డిబిఎఫ్ రాష్ట్ర నాలుగవ మహాసభలలో చుంచు రాజేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా చుంచు రాజేందర్ మాట్లాడుతూ డిబిఎఫ్ లో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ దళిత, గిరిజన కుటుంబాల సమగ్ర అభివృద్ధి కోరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు అణగారిన కుటుంబాలకు అందేలా కృషి చేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఉద్యమ స్పూర్తితో కార్యకర్తలను ఉద్యమం వైపు నడిపిస్తూ మహానీయుల అలోచన విధానంతో పనిచేయడం జరుగుతుందని అన్నారు.
గ్రామాలలో అసైన్డ్ భూములు,ప్రభుత్వ భూముల పరిరక్షణకు,
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం అమలుకై,ప్రభుత్వ పాఠశాలల బలోపేతంకై,సంక్షేమ హాస్టల్ లో కనీస సౌకర్యాల అమలుకై ఉద్యమిస్తూ విద్య హక్కు చట్టం పరిరక్షణకు బడి బాట చైతన్య కార్యక్రమాలను విజయవంతం చేయుటకు కృషి చేస్తూ,దళిత గిరిజన కుటుంబాల ఆర్థిక స్థితి గతులను మార్చే సబ్ ప్లాన్ చట్టం సాధన అమలుకై, గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణకై నిరంతరం ఉద్యమిస్తూ,ప్రపంచ దేశాలలోకేళ్ళ అత్యుత్తమమైన భారత రాజ్యాంగాన్ని మనువాధుల చెరనుండి రక్షించుకోనుటకై నిర్వహించే ఉద్యమాలలో పాలు పంచుకుంటూ పనిచేయడం జరుగుతుందని అన్నారు.
డిబిఎఫ్ లో గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులుగా, భూమి,ఉపాధి హక్కుల రాష్ట్ర కన్వీనర్‌గా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ప్రజలకు,ప్రభుత్వాలకు వారధిగా పనిచేయడం గొప్ప గర్వకారణం అన్నారు.
నా పదవికి సహకరించిన డిబిఎఫ్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్,జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం బాగ్యరావు, జాతీయ కార్యదర్శి పి.శంకర్,రాష్ట్ర అధ్యక్షులు రమేష్ కు మరియు రాష్ట్ర జిల్లా స్థాయి ఉద్యమ సహాచరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...

Translate »