ప్రాణాలతో చెలగాటం పట్టించుకోని అధికారులు

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి:
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మహాలింగాపురం గ్రామంలో ఒకటో నెంబర్ వార్డులో ఇళ్ల మధ్యలో ఉన్న ట్రాన్స్ఫారం ని తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పలుమార్లు అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదనిప్రతిరోజు ట్రాన్స్ఫారం దగ్గర మంటలు రావడం,శబ్దం రావడం జరుగుతుందని,ట్రాన్స్ఫారానికి అనుకొని ఉన్న చిన్నన్న గారి చంద్రయ్య ఇల్లు ఉన్నదని ఇంట్లో ఉండే దంపతులు ఎంతో భయాందోళన గురవుతున్నారని బిక్కుబిక్కుమంటూ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని నివసించే దుస్థితి ఉందని వారు వాపోతున్నారు.

ఇంట్లో నివసిస్తున్న చంద్రయ్య మాట్లాడుతూ వర్షం బాగా పడ్డప్పుడు ఇంట్లో వరకు జిల్ జిల్ మంటూ ఎర్తింగ్ వస్తుందని, బాగా గాలులు వీచినప్పుడు వైరు బాగా కదిలి పక్కనే ఉన్న వైరుకు అనుకొని మంటలు వస్తున్నాయని ఇంటికి ట్రాన్స్ఫార్మర్ కి కేవలం పది అడుగుల దూరమే ఉందని అందువల్ల చాలా భయంతో నివసిస్తున్నామని, ట్రాన్స్ఫార్మర్ ని ఇక్కడ నుంచి తొలగించాలని ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టుకున్న అధికారులు పట్టించుకోవడంలేదని, గ్రామంలో ఉన్న లైన్మెన్ సైతం సమయం పడుతుంది అని చెబుతున్నారని, కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యతో బాధపడుతున్నామని ఇంకెన్నాళ్లు ఈ సమస్యతో మేము బాధపడాలని, మా ప్రాణాలు పోయిన అధికారులకు చలనం ఉండదా ..?

అని కన్నీరు మున్నీరు అయ్యారు. మా ఆవేదనను అర్థం చేసుకుని అధికారులు దీనిపై స్పందించి ఈ ట్రాన్స్ఫార్మర్ ని ఇక్కడి నుంచి తొలగించి ఊరు చివరన పెట్టించాలని కోరుతున్నారు.

You may also like...

Translate »