ఓట్ల లెక్కింపును పకడ్బందీగా చేపట్టాలి .

ఓట్ల లెక్కింపును పకడ్బందీగా చేపట్టాలి .
–బోధన్ అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్.
ఫోటో. శిక్షణలో మాట్లాడుతున్న ఆర్డీవో.
జ్ఞాన తెలంగాణ – బోధన్ టౌన్
ఈనెల నాలుగో తేదీన డిచ్ పల్లి మండలం సుద్దపల్లి సమీపంలో గల సిఎంసి కళాశాలలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతున్నందున ఓట్ల లెక్కింపులో పాల్గొనే సూపర్వైజర్లు, సిబ్బంది మీకు కేటాయించిన సమయానికి ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని బోధన్ అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, బోధన్ ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్ అన్నారు. శనివారం ఆర్డిఓ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ అసెంబ్లీకి సంబంధించి 18 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని కావున ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా, కలెక్టర్ ఆదేశాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో బోధన్ తహసీల్దార్ గంగాధర్ పాల్గొన్నారు.