చిన్నకోడెపాక పెద్ద చెరువు మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.

  • ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జ్ఞానతెలంగాణ, కొత్తపల్లి గోరి, జూన్ 01

భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకోడెపాక గ్రామంలోని పెద్ద చెరువు మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు, గుత్తేదారుకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు.శనివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ నేతలతో కలిసి చిన్నకోడెపాక పెద్ద చెరువు మరమ్మత్తు పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట రెండు చోట్ల గండ్లు పడిన విషయం తెలిసిందేనని అన్నాను. సీఏం, ఇరిగేషన్ మంత్రితో పెద్ద చెరువు కు మరమ్మత్తు పనుల కొరకు రూ.3.63 కోట్లు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు.

ఇట్టి పనులు గత కొన్ని రోజుల కిందటే ప్రారంభం అయ్యాయని, వాటిని త్వరగా పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి రైతాంగానికి నీటిని అందించాలని కోరారు. అలాగే రైతులు ధైర్యంగా ఉండాలని అన్నారు కాంగ్రెస్ రైతుల ప్రభుత్వమని, వచ్చే ఆగష్టు 15కల్లా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ గ్రామ ముఖ్య నాయకులు ఉన్నారు.

You may also like...

Translate »