నెలరోజుల పాప కిడ్నాప్ కేసును చేదించిన.. RGI పోలీసులు

జ్ఞాన తెలంగాణ
రాజేంద్ర నగర్

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలోని శంషాబాద్ పట్టణంలో చిన్నారి అదృష్యమైన ఘటన కలకలం రేపింది వివరాల్లోకెలితే శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి మీడియా సమావేశంలో తెలియచేసిన వివరాలప్రకారం
శంషాబాద్ ఫ్లైఓవర్ కింద చిత్తు కాగితాలు ఏరుకుంటూ వారిటి అమ్ముకొని జీవనం కొనసాగించే దంపతులు ఉన్నారు వారికి నెల రోజుల చిన్నారి ఉంది ఆ పాప
ఈనెల 27వ తేదీన కనిపించడం లేదంటూ RGI ఎయిర్పోర్ట్ పోలీసులకు చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారు.
ఆర్.జి ఎయిర్పోర్ట్ పోలీసులు మరియు ఎస్ఓటి పోలీసులతో టీం గా ఏర్పడి టెక్నికల్ ఆధారులతో మరియు పలు సీసీటీవీ లను పరిశీలించి శుక్రవారం నాడు ఉదయం పాపని ఎత్తుకెళ్లిన నిందితులు మైలార్దేవ్ పల్లికి చెందిన దండు హనుమంతు అతని భార్య చందన. వారి సమీప బంధువైన స్వాతిని గా గుర్తించి వారిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు.
ఈనెల 27 తేదీన రాళ్లగూడ ఫ్లైఓవర్ కింద తల్లిదండ్రులతో పాప పడుకుని ఉండగా నిందితులు సదరు పాపను అపహరించడం జరిగిందని
పాపను విక్రయించేందుకు పథకం వేయడం జరిగిందని తెలిపారు. చిన్నారి పాపని త్లిదండ్రులకు అప్పగించడంతో చిన్నారి తల్లిద్రండ్రులు అత్యనంద భరీతులై పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేసారు.
పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరుగుతుందనిడీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.
ఈ సమావేశంలో శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్, శంషాబాద్ ఎసిపి కేఎస్ రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలరాజు, డి ఐ నాగేశ్వరరావు, ఎస్సైలు అప్పారావు, మన్యం, సిబ్బంది పాల్గొన్నారు.

You may also like...

Translate »