అబ్దుల్ రహీమ్ సేవలు ఉత్తమమైనవి

అబ్దుల్ రహీమ్ సేవలు ఉత్తమమైనవి
జ్ఞాన తెలంగాణ – బోధన్
బోధన్ ఆర్టీసీ డిపోలో బస్ డ్రైవర్ గా సంవత్సరాల పాటు ప్రయాణికులకు ఉత్తమ సేవలందించిన అబ్దుల్ రహీమ్ సేవలు మరువలేనివని డీ.ఎం.శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం బోధన్ డిపోలో డ్రైవర్ అబ్దుల్ రహీమ్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఈ సంధర్బంగ ఆయన మాట్లాడుతూ ప్రయాణికులను ఒక స్థానం నుంచి వారి గమ్యస్థానానికి చేర్చడమనేది ఎంతో బాధ్యతగల ఉద్యోగమని అన్నారు. డ్రైవర్ విధి నిర్వహణలో ఎన్ని ఇబ్బందులున్న ప్రయాణికుల సంక్షేమం కోరుతారని వారి విధులకు ఏది సాటిలేదని అభినందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
