పార్టీలకతీతంగా ఉద్యమకారులను సన్మానిస్తాం: ఎమ్మెల్యే నాయిని

జ్ఞాన తెలంగాణ హనుమకొండ

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉద్యమకారులను సన్మానిస్తామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు హనుమకొండ నయీమ్ నగర్ లో శ్రీరస్తు బాంకెటు హాల్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పార్టీలకు అతీతంగా ఉద్యమకారులను సన్మానిస్తామని అన్నారు.జూన్ 3న హంటర్ రోడ్డు డి కన్వెన్షన్ హాల్ లో ఉద్యమకాలను సన్మానించడం జరుగుతుందన్నారు. ప్రొఫెసర్ కూరపాటి వెంకటరమణ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తిస్తామని, ఒకవేళ పొరపాటున మిస్సయిన ఎం ఎల్ ఏ క్యాంప్ ఆఫీసులో ఎన్రోల్ చేయించుకోగలరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకాలం ఆదుకుంటామని ఏదైతే హామీ ఇచ్చాము ఆ హామీని నెరవేరుస్తాం అందులో భాగంగా జూన్ 2 నుండి దశాబ్ది ఉత్సవాలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హంటర్ రోడ్ డి కన్వెన్షన్ హాల్ నిర్వహిస్తామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాకతీయ ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని, కాకతీయ ఉత్సవాలకు రెండు కోట్లు సరిపోడం లేదు అని కొట్లాడిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎవరు కూడా కాకతీయ ఉత్సవాల గురించి మాట్లాడలేదని విమర్శించారు.వరంగల్ సెంట్రల్ జైల్ కులగొట్టి వేరేచోటకు తరలించినప్పుడు ఎవరు మాట్లాడలేదు,రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్ జోన్ తీసేసి భద్రాద్రి జోన్ లో కలుపుతుంటే, ఆర్టిసి రీటైడింగ్ సంస్థను తరలించినప్పుడు ఏ ఒక్క బి ఆర్ ఎస్ నాయకులు మాట్లాడలేదు అని, మీరు మలిదశ ఉద్యమం ప్రారంభిస్తామని కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణ వస్తే నా బతుకులు బాగుపడతాయని ఉద్దేశంతోనే స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొని పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి, ఒకరిని ఒకరు గౌరవించుకోండి అన్నారు, మీరు ఇంకా అధికారంలో ఉన్నట్లు భ్రమ పడుతున్నారని, ప్రజలను సెంటిమెంట్తో కొడుతూ, ప్రజలను మోసం చేస్తూ, అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని, ప్రజలు మొన్నటి ఎన్నికల్లో మిమ్మల్ని తిరస్కరించారని అది గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, మాజీ కార్పొరేటర్లు అబుబకర్డిన్, బోడ డిన్న, పుల్లూరి సుధాకర్, రహీమున్నీసా బేగం, నారాయణరెడ్డి,దారం జనార్ధన్,జై సింగ్,రాథోడ్, సయ్యద్ వల్లి ఉల్లా కద్రి, 49 డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్ట రఘుపాల్ రెడ్డి,రాజమల్లారెడ్డి, మధుకర్ రెడ్డి,ఎస్ కే సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »