నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

జ్ఞాన తెలంగాణ కేసముద్రం,
మే 31.

ఈరోజు అనగా తేదీ 31 మే 2024 రోజున గౌరవ కలెక్టర్ కలెక్టర్ , జిల్లా ఎస్పీ,జిల్లా వ్యవసాయ అధికారి మహబూబాద్ ఆదేశాల మేరకు కేసముద్రం, ఇనుగుర్తి మండలాల విత్తన ఎరువుల డీలర్లకు రైతు వేదిక కేసముద నందు వానాకాలం 2024 సంవత్సరానిగాను విత్తన సరఫరా మీద అదేవిధంగా విత్తనాలు అమ్మేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీద మండల టాస్క్ఫోర్స్ టీం కేసముద్రం తహాసిల్దార్ మండల వ్యవసాయ అధికారి కేసముద్రం, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసముద్రం, ఆధ్వర్యంలో డీలర్లకు పలు సూచనలు చేయడం జరిగింది వారు మాట్లాడుతూ డీలర్లు ప్రభుత్వం అనుమతించిన విత్తనాలు మాత్రమే రైతులకు విక్రయించాలని అదేవిధంగా ప్రతి కంపెనీకి సంబంధించినటువంటి విత్తన ప్రిన్సిపుల్ సర్టిఫికెట్స్ , మరియు రైతుల వారిగా రిజిస్టర్లు మెయింటైన్ చేయాలని, స్టాక్ రిజిస్టర్ అప్డేట్ చేసుకోవాలని స్టాక్ బోర్డు విధిగా మెయింటైన్ చేయాలని రైతులకు విధిగా బిల్లు ఇవ్వాలని వారు సూచించారు రైతులకు ఎటువంటి విత్తన కొరత లేకుండా చూడాలని వారు సూచించారు అదేవిధంగా బిజీ త్రీ పత్తి విత్తనాలకు అనుమతి లేనందున అటువంటి విత్తనాలు ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు సూచించారు, గ్రామాలలో అపరిచిత వ్యక్తులు ఎవరైనా నకిలీ విత్తనాలు లేదా అనుమతి లేని విత్తనాలు లేదా లూజు విత్తనాలు రైతులకు ఎవరైనా విక్రయిస్తే వ్యవసాయ శాఖ గాని పోలీస్ శాఖ గాని వ్యవసాయ విస్తరణ అధికారులకు గాని తెలియజేయాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల తహాసిల్దార్ టి . దామోదర్ , స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం.వంశీధర్, మండల వ్యవసాధికారి బి. వెంకన్న కేసముద్రం వ్యవసాయ విస్తరణ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.

You may also like...

Translate »