మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ను మూసివేయాలి

మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ను మూసివేయాలి
జ్ఞాన తెలంగాణ – బోధన్
మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ను తక్షణమే మూసివేయాలని
ప్రగతిశీల మహిళా సంఘం బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి డిమాండ్ చేశారు.శుక్రవారం బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ఈ సంధర్బంగ ఆమే మాట్లాడుతూ వైద్యం కోసం వచ్చిన మహిళాల అసభ్య ఫొటోస్, వీడియోలు చిత్రీకరించి మహిళాల ఆత్మ అభిమానం దెబ్బతీసిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో వైద్యం కోసం వచ్చిన మహిళాల అసభ్య ఫొటోస్ మరియు వీడియోలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్న అయ్యప్ప స్కానింగ్ సెంటర్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్యం కోసం వచ్చిన మహిళల ఫోటోలు మరియు వీడియోలను అసభ్యకరంగా చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేయడం,మానసికంగా వేధించడం సిగ్గు చేటని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బోధన్, ఆర్మూర్, బాన్స్వాడ,కామారెడ్డి పట్టణాల్లో కూడా స్కానింగ్ సెంటర్స్ పేరిట ప్రజల్ని నిలువు దోపిడీ చేస్తున్నారని అన్నారు. స్కానింగ్ సెంటర్లలో పురుషులతో కాకుండా మహిళలతో తీయించాలని, మహిళా ఆశా వర్కర్లను సెంటర్లో నియమించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు బీపాషా బేగం, జి. పార్వతి, లక్ష్మి, బి.పోశవ్వ, సావిత్రి, రాజమణి, గంగామణి తదితరులు పాల్గొన్నారు.