రాష్ట్ర రాజముద్రను మార్చడం సరైన పద్ధతి కాదు. మాల మహానాడు డిమాండ్.


జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 30:
యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్ర రాజముద్రను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం, ప్రభుత్వం మారగానే ప్రభుత్వ చిహ్నాలు మార్చడం సరైన నిర్ణయం కాదని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల మాల మహానాడు మండల అధ్యక్షుడు నీలం నరేందర్ అన్నారు . బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ మారుస్తానని అనడం, కాంగ్రెస్ బిజెపి దొండుదొండని ఇప్పటికైనా ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అమలయ్యేలా చూడాలని అన్నారు.

You may also like...

Translate »