చిట్యాలలో పలు విత్తనాల దుకాణాల్లో తనిఖీల నిర్వహణ.


-ఎస్ఐ శ్రవణ్ కుమార్

  • అగ్రికల్చర్ ఏవో శ్రీనివాస్ రెడ్డీ
    జ్ఞానతెలంగాణ, చిట్యాల, మే 30:
    జయశంకర్ భూపాలపల్లి జిల్లాచిట్యాల మండలంలోని పలు విత్తనాల షాప్ లలో తనిఖీలు నిర్వహించారు స్థానిక ఎస్ ఐ శ్రవణ్ కుమార్ మరియు అగ్రికల్చర్ అధికారి ఏఓ శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్బంగా ఎస్ ఐ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మకూడదని రైతులకు సరైన రసీదులు అందించాలని ప్రతిరోజు స్టాకు బోర్డు కనబడేలా పెట్టాలని షాపులో అందుబాటులో ఉన్న అన్ని విత్తనాలు ఎంత క్వాంటిటీలో ఉన్నావో నమోదు పరచాలని తెలియజేసారు అనంతరం అగ్రికల్చర్ అధికారి ఏ ఓ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి రైతు కొనేముందు దాని యొక్క ధర ఎంత ఉంది.షాపు యజమాని ఎంత రేటుకు అమ్ముతున్నారు గ్రహించి ఎవరైనా అధిక రేటుకు అమ్మినట్లయితే పోలీస్ శాఖ వారికి గాని అగ్రికల్చర్ ఆఫీసర్లకు గాని తెలియపరచాలని తెలపడం జరిగింది.ఈ తనిఖీలలో వారి వెంట ఏఈఓ రమణ కుమార్ , హోంగార్డ్ ప్రసాద్ మరియు రాజులు పాల్గొనడం జరిగింది.

You may also like...

Translate »