ఆకస్మికంగా తనిఖీ చేసి కోహెడ పోలీసులు si

ఆకస్మికంగా తనిఖీ చేసి కోహెడ పోలీసులు si
నకిలీ విత్తనాలు అమ్మినట్లైతే ఫెర్టీలైజర్ షాపులను సీజ్ చేయడం జరుగుతుదన్నారు
జ్ఞాన తెలంగాణ కోహెడ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండల కేంద్రంలో
ఈరోజు మండలలోని ఫెర్టీలైజర్ షాపులని మండల వ్యవసాయ అధికారి మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్(SI) ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏ ఓ గారు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మినట్లైతే ఫెర్టీలైజర్ షాపులను సీజ్ చేయడం జరుగుతుదన్నారు.రైతులు లూజ్ గా ఉన్న సంచులలోని విత్తనాలు కొనుగోలు చేయవద్దన్నారు.విత్తన ప్యాకెట్,బిల్లును పంటకాలం పూర్తయ్యే వరకు రైతులు భద్రపరుచుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపబడిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. విత్తన డీలర్లు విత్తన చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ఆయన వెంట విస్తరణ అధికారులు శివకుమార్, మహిపాల్,రేఖ మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు.