ఘనంగా హనుమాన్ నగర సంకీర్తన

ఘనంగా హనుమాన్ నగర సంకీర్తన
జ్ఞానతెలంగాణ, చిట్యాల, మే 29:
కోరిన కోర్కెలు తీర్చే మహాభాలిశాలి హనుమాన్ నగర సంకీర్తన కార్యక్రమం ని చిట్యాల మండల. కేంద్రం లోని వెంకట్రావుపల్లి సి అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం హనుమాన్ భక్తులు నిర్వహించారు. ఈ సందర్బంగా పుర విధులగుండా హనుమాన్ వేశాధారణ లో తిరుగుతూ జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో గ్రామములో అన్ని విధులలో తిరిగారు. మహిళా మణులు మంగళ హరుతులతో, టెంకాయల తొందరగా స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.. ఈ కార్యక్రమం లో దేవస్థానం గురు స్వాములు అంకం. సదానందం,బ్రహ్మము, మాసు రమేష్, చారి, రమేష్, హనుమాన్ మాలధారణ స్వాములు, ప్రజలు పాల్గొన్నారు.