సాలూర చెక్​పోస్టులో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

–రూ. 13,519 నగదు స్వాధీనం

జ్ఞాన తెలంగాణ, బోధన్:
సాలూర మండల కేంద్రంలోని అంతరాష్ట్ర చెక్ పోస్టులో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ నేతృత్వంలో ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సుదీర్ఘంగా సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ మాట్లాడుతూ ఏసీబీ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చెక్పోస్టులపై అవినీతి అరోపణలు రావడంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ముందుగా సాలూర చెక్పోస్టులో జరుగుతున్న తతంగంపై ఏసీబీ సిబ్బంది రెక్కీ నిర్వహించారని తెలిపారు. ఇందులో భాగంగా వాహనదారులు పర్మిట్ కోసం చెక్పోస్ట్ సిబ్బందికి డబ్బులు ఇవ్వడం, కొంతమంది టేబుల్ పై డబ్బులు పెట్టడం పరిశీలించినట్లు తెలిపారు. చెక్పోస్టులో అవినీతి జరుగుతున్నట్లు నిర్ధారించి ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ తనిఖీలో 13,519/- రూపాయల నగదు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల సమయంలో కంప్యూటర్ ఆపరేటర్, ఒక హెడ్ కానిస్టేబుల్ విధులలో ఉన్నారని, ఏఎంవీఐ శ్రీకాంత్ విధులలో లేకపోవడంతో ఆయనను పిలిపించి మరింత తనిఖీలు చేపట్టి విచారించినట్లు తెలిపారు. ఏసీబీ తనిఖీలు జరుగుతున్నట్లు కూడా పలువురు వాహనదారులు పర్మిట్ కోసం రావడం గమనార్హం. తనిఖీల్లో ఏసీబీ ఇన్స్ పెక్టర్లు శ్రీనివాస్, నగేష్, వేణు, సిబ్బంది ఉన్నారు.

You may also like...

Translate »