పార్లమెంట్ ఓట్లు లెక్కింపు లో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచల భద్రత ఏర్పాటు.

పార్లమెంట్ ఓట్లు లెక్కింపు లో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచల భద్రత ఏర్పాటు.
కౌంటింగ్ హలులోకి సెల్ ఫోన్స్ అనుమతి లేదు.
జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి:
జూన్ 1వ తేదీ వరకు ఓట్లు లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ ఎన్నికల కార్యాలయం నుండి జూన్ 4వ తేదీన నిర్వహించనున్న పార్లమెంట్ ఓట్లు లెక్కింపు ప్రక్రియపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాలని, ప్రత్యాన్మయంగా జనరేటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి రౌండ్ కు ఎన్ కోర్ లో అప్ లోడ్ చేయాల్సి ఉన్నందున ఇంటర్ నెట్ ఏర్పాటు చేయాలని అన్నారు. డేటా ఎంట్రీ వేగంగా చేసేందుకు పర్యవేక్షణకు సీనియర్ అధికారిని నియమించాలని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల ఓట్లు లెక్కింపుకు విధులు కేటాయించిన సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా ఆర్డిఓ కు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుండి ఎన్నికల ప్రధాన అధికారి, అదనపు ఎన్నికల అధికారులు లోకేష్ కుమార్, సర్ఫరాజ్ అహ్మద్ లు ఓట్లు లెక్కింపు ప్రక్రియపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు ఐడిఓసి కార్యాలయపు వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి ఆయన పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ వరకు సిబ్బందికి విధులు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసి సన్నద్ధం చేయడానికి విదులు కేటాయించిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఫోన్ చేసి సమగ్ర సమాచారం అంద చేయాలని అన్నారు. ఓట్లు లెక్కింపులో స్ట్రాంగ్ రూము నుండి ఈవిఎమ్స్ తెచ్చే సిబ్బందికి ఒకే రంగు కలిగిన టీ షర్ట్స్ అందచేయాలని ఆయన పేర్కొన్నారు. లెక్కింపు తదుపరి వరంగల్ నుండి జిల్లాకు ఈవిఎమ్స్ మెటీరియల్ తీసుకురావాల్సి ఉన్నందున రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమాచారం అందించాలని అలాగే పటిష్ఠ పోలీస్ బందోబస్తు, ఎస్కార్ట్ ఏర్పాటు నడుమ ఈవిఎం, వివి ప్యాట్ గోదాముకు తరలించాలని ఆర్డిఓను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డిఓ మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు.