విద్యార్థులకు సకాలంలో దుస్తువుల పంపిణీ

విద్యార్థులకు సకాలంలో దుస్తువుల పంపిణీ
మహిళ శక్తి కుట్టు కేంద్రాలను
పరిశీలించిన
డిఆర్డిఎ పి డి శ్రీలత
జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తువులను మండల మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో కుట్టిస్తున్నట్లు
డిఆర్డిఎ పిడి శ్రీలత తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దుస్తువుల తయారీ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. పాఠశాల ప్రారంభానికి ముందే విద్యార్థులకు దుస్తువుల పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నాడు మహేశ్వరం మండలంలోని హర్షగూడ, మహేశ్వరం, తుమ్మలూర్ గ్రామాలలోని మహిళ శక్తి కుట్టు కేంద్రాలను ఎపిఎం సత్యనారాయణ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశ్యం తో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మహేశ్వరం మండలంలోని 43 ప్రభుత్వ పాఠశాలలోని 4596 మంది విద్యార్థిని, విద్యార్థులకు ఒక్కరికి రెండు జతల చొప్పున కలిపి మొత్తం 9192 దుస్తువులను కుట్టిస్తున్నట్లు చెప్పడం జరిగింది. దుస్తువులను కుట్టడానికి మహేశ్వరం మండలంలోని హర్షగూడ, నాగారం, మహేశ్వరం, తుమ్మలూర్, దుబ్బచర్ల క్లస్టర్ లలో మహిళ శక్తి కుట్టు కేంద్రాలను ఏర్పాటు చేసి 69 మంది మహిళలలతో కుట్టిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిసి లు
జి కుమార్, కె సురేష్, యస్ యాదయ్య, సి నర్సింగ్ రావు, వివొఏ లు, గ్రామ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.