రాయలకు నామ ఘన నివాళి

రాయలకు నామ ఘన నివాళి
నిబద్ధత గల నాయకుడు రాయల
రైతు సేవలో తనదైన ముద్ర
రాయల వెంకట శేషగిరిరావుకు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు నివాళి
జ్ఞాన తెలంగాణ మే 27,ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ : డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశ దిన కర్మ సందర్భంగా బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్ల మెంట్ సభ్యులు నామ
నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ
సందర్బంగా ఆయన పార్టీకి ప్రజలకు చేసిన ఎనలేని సేవలను స్మరించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో పని చేసినప్పటి నుంచి రాయలతో తనకున్న అనుబంధాన్ని నామ ఈ సందర్భంగా గుర్తు చేసు కున్నారు. రాయల నిబద్దత గల రాజకీయ నాయకుడని కొని యాడారు. వివిధ పదవుల ద్వారా రాయల ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి ఎంతో
సేవ చేసి, తనదైన ముద్ర వేశారని అన్నారు. రాయల పార్టీకి ఎనలేని సేవలు అందిం చారని అన్నారు. ఎల్లప్పుడు వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఆయన అడుగు జాడల్లో నడవాలని కార్య కర్తలకు సూచించారు. ఎన్టీఆర్ స్పూర్తితో టీడీపీలో చేరి.
వివిధ పదవుల ద్వారా రాయల శేషగిరిరావు ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు. చనిపోయేంత వరకు రైతు పక్షపాతిగా ఉంటూ రైతాంగ సమస్యలపై అలుపెరగని
పోరాటం చేశారని, రైతుల కోసం ఎంతో శ్రమించారని చెప్పారు. టీడీపీలో ఉన్న ప్పుడు తల్లాడ మండలం గంగదేవిపాడు సొసైటీ అధ్యక్షునిగా రైతుల కోసం పాటుపడ్డారని చెప్పారు. డీసీసీబీ డైరెక్టర్ గా పని చేశారన్నారు. తర్వాత 2019 నుంచి 2023 వరకు
డీసీఎంఎస్ చైర్మన్ గా పని చేసి, ప్రజలకు ఎనలేని సేవలు అందించిన నేత రాయల అని
నామ కొనియాడారు. పార్టీ బలోపేతానికి ఆధ్యాంతం శ్రమించిన నాయకుడని పేర్కొన్నారు. శోకతప్తులైన వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నట్లు నామ నాగేశ్వ రరావు పేర్కొన్నారు.
