వికారాబాద్ జిల్లా లో వాహనాల తనిఖీ

జ్ఞాన తెలంగాణ న్యూస్
వికారాబాద్ జిల్లా
నవాబుపేట్ మండలం

తెలంగాణ ఎక్సైజ్ శాఖ, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు కలిసి సోమవారం రోజు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మాదక ద్రవ్యాలు, గంజాయి, అక్రమ మద్యం సరఫరాను అరికట్టడానికి వికారాబాద్ జిల్లా మన్నెగూడ చౌరస్తాలో సిబ్బంది విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారని తెలిపారు. అక్రమార్కులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు

You may also like...

Translate »