ఆదర్శ మూర్తుల సేవలు చిరస్మరనీయం

ఆదర్శ మూర్తుల సేవలు చిరస్మరనీయం
తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రాం చందర్
జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్)యూసుఫ్ గూడ చెక్ పోస్టు జే ఏ సి కార్యాలయంలో దాసరి భాస్కర్ గారు ఏర్పాటు చేసిన మాత రమాబాయ్ అంబేద్కర్ 89వ వర్ధంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రాంచందర్ గారు విచ్చేసి మాత రమాబాయ్ చిత్రపటానికి ఫూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాత రామాబాయ్ చేసిన సేవలను గుర్తు చేశారు. మాత రమబాయ్ అంబేద్కర్ అంటే ఒక త్యాగం, ఒక పోరాటం ప్రతి మగాడి విజయం వెనకాల ఒక మహిళా ఉంటుంది అనేదానికి రమబాయ్ జీవితమే ఉదాహారణ. చిన్న తనంలోనే అంబేద్కర్ ను బొంబాయి ఫిష్ మార్కెట్ లో వివాహం చేసుకొనే సమయానికి ఆమే వయస్సు తొమ్మిది సంవత్సరాలు ఉన్నత చదువుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ బరోడా మహారాజు సహకారంతో లండన్ కు వెళ్ళినప్పుడు ఇంటి భాద్యత తీసుకొని ఆవు, గేదే పేడతో పిడుకలు చేసి అమ్మి కుటుంబం తో బాటు వచ్చిన డబ్బులు అంబేద్కర్ చదువులకు పంపేదని రమబాయ్ కి పుట్టిన ఐదు మంది సంతానంలో నలుగురు పిల్లలు అనారోగ్యంతో బాధపడుతూ మందులకు డబ్బులు లేక చిన్నతనంలోనే అనారోగ్యంతో మరణిస్తే ఏమాత్రం అధైర్యం పడక బడుగు బలహీనవర్గాల ప్రజల కోసం, వారి హక్కుల కోసం తమ కుటుంబాన్ని త్యాగం చేసిన గొప్ప త్యాగమూర్తి రమబాయ్ అంబేద్కర్ అని వారు తెలిపారు.తన కొడుకు చనిపోయినప్పుడు బాబాసాహెబ్ చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి చూస్తూ తన కొంగును చింపి కొడుకు శవం మీద కప్పి ,తమ పరిస్థితిని
ఎదుటివారికి చూపించకుండా జాగ్రత్త పడిన విషయం తెలిస్తే బాబాసాహెబ్ కోసం ఆమె పడిన ఆవేదన ఎలాంటిదో అర్థం అవుతుంది.ఆమె జీవిత కాలం అంత కష్టమే ఈ రోజున రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజలు సుఖ సంతోషాలతో అనుభవిస్తున్నారు అనడంలో సందేహం లేదు.చివరికి ఈ పోరాటం లో అలిసి జబ్బుపడి చివరగా 1935 మే 27వ తేదీన విషజ్వరంతో మరణించింది . చనిపోయే సమయానికి ఆమె వయస్సు 35 సంవత్సరాలు అని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రాంచందర్, వైస్ చైర్మన్ జితేందర్ దాసరి భాస్కర్ , రాజ్ కుమార్ , రాష్ట్ర కో కన్వీనర్ పాలడుగు శ్రీనివాస్, ఎడ్ల వేంకటేశ్వర్లు, వెంకటేష్ సింగం, కాశీనాథ్ , సాయి బాలస్వామి తదితరులు పాల్గొన్నారు