చేవేళ్ల ఎంపీ పీఠం కేవీఆర్ దే

చేవేళ్ల ఎంపీ పీఠం కేవీఆర్ దే
మహేశ్వరం బీజేపీ ఇంచార్జి అందెల శ్రీరాములు
జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)
చేవేళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఇచ్చిన ఆత్మీయ విందు కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు సహా ప్రజాప్రతినిధులు, బీజేపీ, బీజేవైఎం సహా మోర్చాల నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ వచ్చే ఫలితాల్లో కేవీఆర్ కు భారీ మేజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కష్టపడి పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.
