ఔటర్ పై ఆటోను కారు ను డి కొట్టిన బస్సు

జ్ఞాన తెలంగాణ
రాజేంద్రనగర్…

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 17 వద్ద అమల ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు 30 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది ప్రయాణికులంతా ఒక్క సారిగా ఆందోళన చెందారు.
ఒక కారుని ఢీ కొట్టిన బస్సు ముందు వెళ్తున్న ఆటోని కూడా అతివేగంగా ఢీకొనడంతో ఆటలో ప్రయాణిస్తున్న వారికి కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు కావడంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందజేశారు.

బస్సులో 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.
ప్రయాణికులు అంతా బస్సు వేగంగా ఉండడం తోనే ఈ ఘటన జరిగింది 30 మంది ప్రయాణికుల ప్రాణాలు వారి చేతిలో పెట్టుకుని బస్సు ఆగగానే కిందికి దిగి నుంచున్నారు ఆటో డ్రైవర్ని గాయాలు కావడంతో వెంటనే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులే పోలీసులకు సమాచారం అందజేసి ఆటో డ్రైవర్ని స్థానికంగా ఉన్న అంబులెన్స్ సహాయంతో ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.
అతివేగమే కారణంగా ఈ ఘటన జరిగిందని ప్రయాణికులు అంటున్నారు ప్రయాణిస్తున్న ప్రయాణికులు అంతా మాకు పెను ప్రమాదం తప్పిందని పోలీసులకు సమాచారం అందజేశారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You may also like...

Translate »