లైబ్రరీ అభివృద్ది కమిటి ఎన్నిక

లైబ్రరీ అభివృద్ది కమిటి ఎన్నిక
–అధ్యక్షులుగా ఎన్నికైన స్వామిగౌడ్.
ఫోటో.నూతన అధ్యక్షులుగా ఎన్నికైైన స్వామిగౌడ్ ను అభినందిస్తున్న సభ్యులు.
జ్ఞాన తెలంగాణ – బోధన్
సాలురా గ్రామంలోని అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం (లైబ్రరీ) అభివృద్ధి కమిటీని ఆదివారం శాశ్వత సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకఉన్నారు. నూతన లైబ్రరీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా మల్లెపూల స్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శిగా లింబూరి లక్ష్మణ్ (తేజ), ఉపాధ్యక్షులుగా కర్ణం అశోక్ బాబా, ఇల్తెపు రమేష్, శివకాంత్ పటేల్, సంయుక్త కార్యదర్శి వడ్ల దత్తురాం, నజీర్, ముఖ్య సలహాదారులుగా ఇల్తెపు శంకర్ సార్, ప్రజ్ఞశ్రీ రాజు సార్, సింగడి పాండు, బొర్ర గంగారం, అల్లే రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులకు శాశ్వత సభ్యులు అఅభినందించారు. ఈ సంధర్బంగ ఆయన మాట్లాడుతూ లైబ్రరీ అభివృద్దికి, పాఠకుల సౌకర్యార్థం కావలసిన సౌకర్యాల ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని అధ్యక్షులు స్వామిగౌడ్ తెలిపారు.