కేయూలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

కేయూలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
జ్ఞాన తెలంగాణ, హనుమకొండ:
కేయూలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలోని సమస్యలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లైబ్రరీకి వెళ్లి పట్టభద్రులను కలిసి ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలిపించాలని కోరారు. యూనివర్సిటీకి వచ్చిన ఎమ్మెల్యేకు ఎన్ఎస్యూఐ, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు శాలువా కప్పి స్వాగతం పలికారు.
