రాజకీయ శిక్షణ తరగతులకు తరలిరండి

–సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు

జ్ఞానతెలంగాణ, స్టేషన్​ ఘన్పూర్:

స్టేషన్​ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో జనగామ జిల్లా స్థాయి శాఖ కార్యదర్శి, పట్టణ కమిటీ సభ్యుల రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించబడుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో సిపిఎం మండల నాయకుల సమావేశం మండల కార్యదర్శి రాపర్తి సోమయ్య అధ్యక్షున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ 2024 మే 31న, జూన్ 1 తేదీన స్టేషన్గన్పూర్ మండల కేంద్రంలో రాజకీయ శిక్షణ తలలు నిర్వహించబడుతుందన్నారు. రాజకీయ శిక్షణ తరగతులతో ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు చర్చించుకోవడం జరుగుతుందన్నారు. శాస్త్రీ ఆలోచనను ప్రజా సంఘాలు పార్టీ నిర్మాణం శాఖల పని పద్ధతులు బోధించబడతాయి అన్నారు. ప్రతి కార్యకర్త సొంత పనికి ఇచ్చిన ప్రాధాన్యతను పార్టీకి ఇచ్చి రెండు రోజులు జరిగే శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కాట సుధాకర్, వడ్లకొండ సుధాకర్, నక్క యాకయ్య, నల్ల తీగల శ్రీనివాస్, ఎండి షబానా, గుండెబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »