పోలీసుల అత్యుత్సాహం, బలైవుతున్న సామాన్య ప్రజానీకం

జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/అశ్వారావుపేట న్యూస్: అరవై ఎకరాల భూస్వామికి కొమ్ము కాస్తూ, రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ, అశ్వారావుపేట పోలీసులు సామాన్య ప్రజల పైన అక్రమ కేసులు పెడుతూ, పలు రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని
అశ్వరావుపేట మండలం వేదాంతపురం గ్రామపంచాయతీ తిమ్మాపురం గ్రామానికి చెందిన నూకవరపు సూర్యకుమారి W/O రాంబాబు(లేటు )గురువారం మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం కి చెందిన 60 ఎకరాల భూస్వామి అయిన పాలూరు సత్యనారాయణ, తన భర్త అయిన నూకవరపు రాంబాబును 2007 లో మాయం చేసి, కేసులు పెట్టవద్దని బెదిరించి, మానసికంగా వేధించి, తనకు 5 ఎకరాల భూమిని రాసి ఇస్తానని నమ్మించి, 5 ఎకరాల పొలం రాసి ఇచ్చినట్టే ఇచ్చి ఆ పొలం కాగితాలను కూడా మాయం చేసి తన పొలంలోనే కష్టపడి కట్టుకున్న ఇంటి నుండి ఖాళీ చేసి వెళ్లిపోవాలని, నిర్దాక్షిణ్యంగా రోడ్డుమీదకు ఈడవాలని చూస్తున్నాడని వాపోయింది. మాకు ఆ పొలంలో ఉన్న ఇంటికి, మామిడి చెట్లకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా సరే మేము ఎక్కడి నుండో వచ్చి దొంగతనానికి పాల్పడుతున్నామని కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతో మా మీద దుష్ప్రచారం చేస్తూ,మేము ఎటువంటి తప్పులు చేయకపోయినా మాపై తప్పుడు కేసులు పెడుతున్నారు.
మామీద కేసులు ఎందుకు పెడుతున్నారని అడిగితే ఎస్సై అసభ్య పదజాలంతో నన్ను నా పిల్లలను ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడుతున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మా కుటుంబాన్ని అవస్థలు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్టేషన్ బెయిల్ ఇస్తామని పిలిపించి, మిమ్మల్ని రిమాండ్ చేస్తామని చెబుతూ, బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు బిదవాళ్లు వాళ్ళు కోటీశ్వరులు అంటూ ఎంతో కొంత తీసుకొని రాజీ పడకపోతే మీ కుటుంబం మీద కేసుల మీద కేసులు పెట్టి మిమ్మల్ని కోర్టుకు తిప్పుతారు అని పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నారు.మా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పినా వినకుండా పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఉదయం నుండి సాయంత్రం వరకు కూర్చోబెడుతున్నారు, ఇలా ఆరోగ్యం బాగోని నన్ను మూడు రోజులు పోలీస్ స్టేషన్ కి తిప్పగా పోలీస్ స్టేషన్ లోనే స్పృహ తప్పి పడిపోయాననీ, హాస్పిటల్లో చేరాను అని చెప్తున్నారు. నా పరిస్థితికి పోలీసులే కారణం. కావున ఉన్నతాధికారులు మా సమస్యను పరిశీలించి మాకు అన్ని విధాల న్యాయం చేయవలసినదిగా జిల్లా అధికారులకు తమ గోడును మీడియా ముఖంగా వేడుకుంటున్నా అని సూర్యకుమారి అన్నారు.

You may also like...

Translate »