ఘనంగా కాంగ్రెస్ నాయకుడు గుర్రం రణధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు

జ్ఞాన తెలంగాణ
శంషాబాద్
రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుర్రం రణధీర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మండలంలోని పెద్దతోపుర గ్రామంలో మరియ సదన్ వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి కాంగ్రెస్ నాయకులు పండ్లు బిస్కెట్ ప్యాకెట్లు మరియు భోజనం పంచిపెట్టారు. ఆశ్రమంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తమ అభిమాన నాయకులు గుర్రం రణధీర్ రెడ్డి కి భగవంతుడు తన కృపను ప్రసాదింపజేసి మంచి ఆయు ఆరోగ్యాలు ప్రసాదింపజేయాలని ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు
మహమ్మద్ నజీరుద్దీన్,
గుంటి ప్రవీణ్ కుమార్, స్వరాజ్, పాల్సన్, తూర్పు సంజీవ రెడ్డి, నజీముద్దీన్, రఘనందన్, ప్రశాంత్, శ్రీనివాస్ యాదవ్, గణేష్ నాయక్, చిరంజీవి గౌడ్, కాజా పాషా మరియు అభిమానులు పాల్గొన్నారు.

You may also like...

Translate »