నల్ల మట్టి తరలింపు వాహనాలను పట్టుకున్న పోలీసులు

నల్ల మట్టి తరలింపు వాహనాలను పట్టుకున్న పోలీసులు
జ్ఞాన తెలంగాణ, సిద్దిపేట
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో తెల్లవారుజామున కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూరెళ్ల గ్రామంలో ని పెద్ద చెరువు లో నుండి తిప్పారపు నవీన్ చారి తం డ్రి వెంకట నరసయ్య, గ్రామం కూరెళ్ల మండలం కోహెడ, అతను ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా చెరువులో నుండి నల్ల మట్టిని జెసిపి మరియు తొమ్మిది ట్రాక్టర్లతో తన ఇటుక బట్టీల వద్దకు తరలిస్తున్నాడని నమ్మదగిన సమాచా రం రాగా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సి బ్బంది కోహెడ ఎస్ఐ తిరుపతి, సిబ్బందితో వెళ్లి పట్టుకు న్నారు. కోహెడ పోలీసులు పూ ర్తి విచారణ జరిపి తగు చ ర్యలు తీసుకుంటారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, మాట్లా డుతూ పోలీస్ కమిషనర్ ఆదేశానుసా రం జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన నిల్వ ఉంచిన, చట్ట ప్రకా రం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. జూదం, గ్యాంబ్లింగ్ చట్ట వ్యతిరేక కార్యక్ర
మాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింద న్నారు. గ్రామాలలో, పట్టణాలలో ఇసుక అక్రమ రవాణా చే సిన, పిడిఎస్ రైస్ అక్రమంగా దాచిపెట్టిన రవాణా గ్యాం బ్లింగ్, పేకాట, మరిఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమా లు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపే ట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 అందించాలని సూచిం చారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.