రాకేష్ రెడ్డి గెలిపే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే ప్రచార కార్యక్రమం

జ్ఞానతెలంగాణ, టేకుమట్ల, మే 25:
భూపాలపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టేకుమట్ల మండలంలో ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కొరకే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆలోచించి ప్రశ్నించే గొంతుక బి ఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపివ్వాలని కోరారు.రైతు బిడ్డ,ఉన్నత విద్యావంతుడు, బిట్స్ పిల్లానీలో ,గోల్డ్ మెడలిస్ట్, అమెరికాలో ఉన్నత ఉద్యోగాలు చేస్తూ, భారతదేశానికి తిరిగి వచ్చి,మాతృభూమి మీద,మమకారంతో, అభిమానంతో, పేద ,బీద, బడుగు, బలహీన వర్గాల, అభివృద్ధి లక్ష్యంగా, రాజకీయాలకు వచ్చి, రాజకీయాలలో యువత పాత్ర,రాజకీయాలలో నూతన ఉరవడి సృష్టించిన యువ నాయకుడు, రాకేష్ రెడ్డి క్రమ సంఖ్య, 3వ నెంబర్ పై, మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి పట్టభద్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లారెడ్డి, మండల నాయకులు మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, యూత్ నాయకులు వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

You may also like...

Translate »