తీన్మార్ మల్లన్న గెలుపుకై ప్రతి ఒక్కరు కృషి చేయాలి


మండల పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్
జ్ఞాన తెలంగాణ టేకుమట్ల.
నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతి కార్యకర్త తమవంతు కృషి చేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ పిలుపునిచ్చారు. తీన్మార్ మల్లన్నకు పట్టభద్రులు అండగా ఉండాలని కోరారు. బిజెపి బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలని, తెలంగాణ ప్రజల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి తీన్మార్ మల్లన్న అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మండలంలోని పట్టభద్రులను కోరారు.

You may also like...

Translate »